padmarao: కార్తీక్ దురాగతానికి బ‌లైన సంధ్యారాణి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి ప‌ద్మారావు!

  • హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల యువ‌తిని హ‌త్య చేసిన‌ ప్రేమోన్మాది
  • బాధిత కుటుంబానికి సాయం అందిస్తాం
  • కార్తీక్‌ని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా నా వంతు కృషి చేస్తా
  • ఈ తరహా ఘ‌టనలు పునరావృతం కాకుండా చర్యలు
హైద‌రాబాద్, లాలాపేట ప్రాంతంలో ప్రేమోన్మాది కార్తీక్ దురాగతానికి బ‌లైన యువ‌తి సంధ్యారాణి కుటుంబ స‌భ్యుల‌ను తెలంగాణ‌ మంత్రి పద్మారావు ప‌రామ‌ర్శించారు. ఇలాంటి ఘ‌టన జ‌ర‌గ‌డం విచారకరమని అన్నారు. నిందితుడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామ‌ని అన్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా ఆ కుటుంబానికి అండగా నిలుస్తాన‌ని, అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ తరహా ఘ‌టనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి పద్మారావు పేర్కొన్నారు.    
padmarao
telangana minister
sandya rani murder case

More Telugu News