raviteja: శ్రీను వైట్ల దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసిన సునీల్

  • రవితేజ హీరోగా శ్రీను వైట్ల సినిమా
  • ముఖ్యమైన పాత్ర కోసం సునీల్ ఎంపిక 
  • మైత్రీ మూవీస్ బ్యానర్లో సెట్స్ పైకి  

శ్రీను వైట్ల తన తదుపరి సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సునీల్ ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. సునీల్ ను దృష్టిలో పెట్టుకునే శ్రీను వైట్ల ఈ పాత్రను పూర్తి వినోదాత్మకంగా మలిచాడట.

శ్రీను వైట్ల సినిమాలో కామెడీ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో వుంటాయో తెలిసిందే. అలాగే ఈ సినిమాలోను కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉంటుందట. పెద్ద హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేయాలని నిర్ణయించుకోవడం వలన, శ్రీను వైట్ల సినిమాల్లో గతంలో చేసిన పాత్రలు తనకి మంచి పేరు తీసుకురావడం వలన సునీల్ వెంటనే అంగీకరించాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లోను ..' సైరా'లోను సునీల్ చేయనున్నాడు.     

More Telugu News