lalu prasad: దాణా కుంభ‌కోణం కేసులో తీర్పు వెల్ల‌డి.. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు

  • 1990-97 మ‌ధ్య లాలూ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అక్ర‌మాలు
  •  బీహార్‌లో దాణా కోసం మొత్తం రూ.900 కోట్లు ఖర్చు
  • అందులో అక్ర‌మంగా  రూ.89 లక్షల విత్‌డ్రా
  • నకిలీ కంపెనీలను సృష్టించి వాటి పేరుతో డబ్బులు డ్రా

దాణా కుంభ‌కోణం కేసులో రాంచీలోని సీబీఐ కోర్టు తీర్పు వెల్ల‌డించింది. ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను దోషిగా ప్ర‌క‌టించింది. 1990-97 మ‌ధ్య లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ బీహార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దాణా కొనుగోళ్ల‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో బీహార్‌లో దాణా కోసం మొత్తం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. 1991 నుంచి 1994 మధ్య ట్రెజరీ నుంచి పశుదాణా కోసం అక్ర‌మంగా రూ.89 లక్షలు విత్‌డ్రా చేశారు. ఈ కేసులోనే సుదీర్ఘంగా వాద‌న‌లు జ‌రిగాయి. దాణా సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ, లేని కంపెనీలను సృష్టించి వాటి పేరుతో డబ్బులు డ్రా చేశారని కోర్టు తేల్చింది.   

  • Loading...

More Telugu News