samanta: సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు దిశగా సమంత?

  • 'యూటర్న్' తెలుగు రీమేక్ లో సమంత 
  • ఈ సినిమాతో నిర్మాతగా మారే ప్రయత్నం  
  • చైతూతో కలిసి కొత్త బ్యానర్ ఆలోచన     

తెలుగు సినిమా విజయంలో .. వైభవంలో అన్నపూర్ణ స్టూడియోస్ పాత్ర కూడా ప్రధానమైనదే. ఈ సంస్థలో చేసే అవకాశం రావడమే అదృష్టమని అనుకునే నటీనటులు .. సాంకేతిక నిపుణులు వున్నారు. ఈ సంస్థలో చేసిన తరువాత ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నవారు వున్నారు. అలాంటి ఈ బ్యానర్ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ బ్యానర్ పై నిర్మించిన 'మనం' సినిమా, అక్కినేని ఫ్యామిలీకి అపురూప చిత్రంగా నిలిచింది.

దాంతో 'మనం' అనే టైటిల్ ను వదులుకోవడం ఇష్టం లేక, నాగ్ 'మనం ఎంటర్ ప్రైజెస్'ను స్థాపించి, అఖిల్ .. చైతూ సినిమాలు ఈ బ్యానర్ పై వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఈ బ్యానర్ కాకుండా సమంత మరో బ్యానర్ ను ఏర్పాటు చేయనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక వార్త వినిపిస్తోంది. కన్నడలో హిట్ అయిన 'యూటర్న్'ను తెలుగులో ఆమె రీమేక్ చేయనుంది. చైతూతో కలిసి ఒక కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేసి .. ఈ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.    

  • Loading...

More Telugu News