asaduddin owaisi: రాహుల్ గాంధీకి గుళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా?: ఒవైసీ మండిపాటు

  • గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప‌లు దేవాల‌యాల‌ను సంద‌ర్శించిన‌ రాహుల్
  • మ‌ళ్లీ ఈ రోజు సోమ్‌నాథ్ దేవాల‌యానికి
  • మసీదులు, ముస్లిం ప్రజలు కంటపడటం లేదా?
ఇటీవ‌ల గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌లు దేవాల‌యాలకు వెళ్లి ప్ర‌త్యేకంగా పూజ‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హిందువుల కోస‌మే ఆయ‌న దేవాల‌యాల‌కు వెళుతున్నార‌ని కూడా కొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు.

కాగా, రాహుల్ గాంధీ ఈ రోజు కూడా సోమ్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. దీనిపై స్పందించిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. రాహుల్‌ గాంధీపై విమ‌ర్శ‌లు చేశారు.  రాహుల్ గాంధీకి గుళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మసీదులు, ముస్లిం ప్రజలు కంటపడటం లేదా? వాటిని ఎందుకు పట్టించుకోవటం లేదు? అని అడిగారు. రాజకీయ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా మాత్ర‌మే కొంద‌రు ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు.
asaduddin owaisi
rahul gandhi
temples

More Telugu News