jd chakravarthi: జేడీ చక్రవర్తి భార్య కూడా డైరెక్టర్ యోగిపై ఫిర్యాదు చేసింది!

  • అభ్యంతరకరంగా నటించాలంటూ ఒత్తిడి
  • 2016లో యోగిపై అనుకీర్తి ఫిర్యాదు
  • అదే ఏడాది జేడీని పెళ్లి చేసుకున్న అనుకీర్తి
తనను వేధింపులకు గురి చేశాడంటూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిపై నటి హారిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసు విచారణలో మరో కొత్త విషయం వెలుగు చూసింది. అనుకీర్తి అనే నటి కూడా యోగిపై 2016 జూలైలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అభ్యంతరకరంగా నటించాలంటూ తనపై ఒత్తిడి చేసినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొంది. అదే ఏడాదే నటుడు జేడీ చక్రవర్తిని అనుకీర్తి వివాహం చేసుకుంది. మరోవైపు, యోగికి సంబంధించి మరిన్ని విషయాలను అన్వేషించే పనిలో పోలీసులు ఉన్నారు. పాత కేసులను బయటకు తీస్తున్నారు. 
jd chakravarthi
anukeerthi
director yogi
actress harika

More Telugu News