aarushi: ఆరుషి హ‌త్య‌కేసు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న సీబీఐ

  • రాజేశ్‌, నూపుర్ త‌ల్వార్‌ల‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టించ‌డంపై స‌వాలు
  • నెలాఖ‌రులోగా సుప్రీంకోర్టులో అప్పీలు
  • వెల్ల‌డించిన సీబీఐ అధికారులు

సంచ‌ల‌నం సృష్టించిన ఆరుషి హ‌త్య‌కేసులో ఆమె త‌ల్లిదండ్రులు రాజేశ్ త‌ల్వార్‌, నూపుర్ త‌ల్వార్‌ల‌ను నిర్దోషులుగా తేల్చుతూ అల‌హాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ తీర్పును స‌వాలు చేస్తూ సీబీఐ త్వ‌ర‌లో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెలాఖ‌రులోగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్టు సీబీఐ అధికారులు వెల్ల‌డించారు.

2008, మే 16న నోయిడాలో జ‌రిగిన ఆరుషి, హేమ‌రాజ్‌ల హ‌త్య కేసులో భాగంగా రాజేశ్‌, నూపుర్ త‌ల్వార్‌లు జైలు శిక్ష అనుభవించారు. ఈ హ‌త్య‌లు చేసింది వారేనంటూ సీబీఐ మొద‌ట్నుంచీ వాదిస్తూనే ఉంది. అయితే ఇటీవ‌ల వారిని నిర్దోషులుగా తేల్చుతూ అల‌హాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.

More Telugu News