loans to students: విద్యార్థులకు 'ఆగ్జిలో' బంపర్ ఆఫర్.. రూ.35 లక్షల వరకూ హామీ లేకుండా విద్యారుణాలు!

  • హైదరాబాదులో ఆగ్జిలో కార్యకలాపాలు ప్రారంభం
  • దేశవ్యాప్తంగా ఏడాదిలో రూ. 350 కోట్ల రుణాలు లక్ష్యం
  • వడ్డీ రేటు 10 నుంచి 13 శాతం

దేశ, విదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యల కారణంగా ఎందరో విద్యార్థులకు అది కలగానే మిగిలిపోతోంది. ఇలాంటి వారి కోసం ఎలాంటి హామీ లేకుండానే రుణాలు ఇచ్చేందుకు ఆగ్జిలో ఫిన్ సర్వీసెస్ సంస్థ ముందుకొచ్చింది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఈ బ్యాంకింగేతర సంస్థ హైదరాబాదులో తన లావాదేవీలను ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో నీరజ్ సక్సేనా మాట్లాడుతూ, రానున్న ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా రూ. 350 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా రూ. 75 కోట్ల మేర రుణాలు ఇస్తామని చెప్పారు.

చదువులో మంచి ప్రతిభ కనబరిచి, మంచి ఉద్యోగావకాశాలున్న కోర్సులు చేసే విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. కొన్ని నిబంధనలకు లోబడి రూ. 35 లక్షల వరకు ఎలాంటి హామీలు లేకుండానే రుణాలను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. వడ్డీ రేటు 10 నుంచి 13 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఇతర సంస్థల నుంచి తీసుకున్న విద్యా రుణాలను కూడా తమ వద్దకు బదిలీ చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. 

  • Loading...

More Telugu News