rayalaseema express: పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్ ప్రెస్

  • తిరుపతి నుంచి నిజామాబాద్ వస్తున్న రాయలసీమ ఎక్స్ ప్రెస్
  • నిజామాబాద్ జిల్లా శిర్నాపల్లి వద్ద ప్రమాదం
  • పట్టాలు తప్పిన ఇంజిన్, మూడు బోగీలు

తిరుపతి నుంచి నిజామాబాద్ వస్తున్న రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఈ ఉదయం పట్టాలు తప్పింది. నిజామాబాద్ జిల్లా శిర్నాపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఇంజిన్ తో పాటు మూడు ఏసీ బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో అర కిలోమీటర్ మేర ట్రాక్ ధ్వంసమైంది. బోగీలు పట్టాలు తప్పిన సమయంలో భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు. రైలు ఆగిన వెంటనే భయంతో రైలు నుంచి దిగిపోయారు. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు హుటాహుటిన శిర్నాపల్లికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News