Arun Jaitly: రూ.2000 నోట్లపై అవన్నీ అవాస్తవాలే.. నమ్మొద్దు!: ఆర్థిక మంత్రి జైట్లీ

  • 2వేల నోట్ల ఉపసంహరణ వార్తలు అవాస్తవం
  • ప్రభుత్వం చెబితే తప్ప ఇలాంటి వార్తలను నమ్మొద్దు
  • ఎస్బీఐ స్టేట్ మెంట్ తర్వాత 2వేల నోట్ల రద్దు ప్రచారం

మోదీ ప్రభుత్వం త్వరలోనే రూ. 2000 నోట్లను ఉపసంహరించబోతోందనే వార్తలు దేశ వ్యాప్తంగా మరోసారి అలజడిని రేపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ వార్తలపై స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనలు వెలువడితే తప్ప ఇలాంటి విషయాలను నమ్మరాదని తెలిపారు. 2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసిందని, లేదా తక్కువ మొత్తంలో మాత్రమే ప్రింట్ చేస్తోందంటూ ఎస్బీఐ పేర్కొన్న తర్వాత... 2వేల నోట్ల అంశంపై పలు వార్తలు చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి.

More Telugu News