లైంగిక వేధింపులు.. టాలీవుడ్ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి!

23-12-2017 Sat 06:20
  • నటి హారికపై లైంగిక వేధింపులు
  • దర్శకుడు యోగిపై కేసు నమోదు
  • గంటన్నర సేపు విచారణ

సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఇదే సమయంలో తమకు ఎదురైన అనుభవాలను నటీమణులు అంతే ధైర్యంగా వెల్లడిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో కూడా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. సినీ దర్శకుడు యోగి తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి గంటన్నర సేపు విచారించారు. అయితే, పోలీసుల ఎదుట కూడా హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.