గరికపాటిని మేము పిలవలేదు..ఆహ్వానపత్రిక చూపించమనండి!: నందిని సిధారెడ్డి

22-12-2017 Fri 20:38
  • మేము ఆహ్వానించింది మాడుగుల నాగఫణి శర్మను
  • ఈ మహాసభల్లో దళిత కవులనూ ఆహ్వానించాం
  • బీసీ కులాలకు చెందిన కవులూ పాల్గొన్నారు 

ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించని ప్రపంచ తెలుగు మహాసభలకు తాను కూడా వెళ్లనని మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఘాటుగా స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘గరికపాటి నరసింహారావును మేము పిలవలేదు. అసలు, ఆయన్ని ఆహ్వానిస్తూ పంపిన ఆహ్వానపత్రికను చూపించమనండి! మేము ఆహ్వానించింది మాడుగుల నాగఫణి శర్మను’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ మహాసభల్లో దాదాపు ఎనభై మంది వరకు దళిత కవులు, ఎనభై నుంచి వంద మంది వరకు బీసీ కులాలకు చెందిన కవులు ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.