gujarath: గుజరాత్ సీఎం గా మళ్లీ విజయ్ రూపానీ.. శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటన!

  • గుజరాత్ బీజేపీ శాసనసభాపక్షం సమావేశం
  • బీజేపీ శాసనసభాపక్ష నేతగా విజయ్ రూపానీ
  • కేంద్ర పరిశీలకుడు అరుణ్ జైట్లీ ప్రకటన
గుజరాత్ సీఎం గా మళ్లీ విజయ్ రూపానీకే అవకాశం లభించింది. గుజరాత్ బీజేపీ శాసనసభాపక్షం సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా విజయ్ రూపానీని మరోసారి ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర పరిశీలకుడు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

అలాగే, గుజరాత్ ఉపముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ కు మరోమారు అవకాశం లభించింది. విజయ్ రూపానీని మళ్లీ సీఎంగా కొనసాగిస్తారా? లేదా? అనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. దానికి తోడు స్మృతి ఇరానీని ముఖ్యమంత్రిగా పంపుతారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జైట్లీ ప్రకటనతో ఈ అనుమానాలకు తెరపడినట్టయింది.  
gujarath
vijay rupani

More Telugu News