garikapati: మళ్లీ, గరికపాటి అవధానమే పెడితే.. మా మెట్టు రామశర్మ ఎటుపోతాడు?: గరికపాటికి సిధారెడ్డి కౌంటర్!

  • తెలుగు మహాసభలకు రావడం రాకపోవడమనేది ఆయన విజ్ఞత
  • మా మెట్టు రామశర్మ కూడా శతావధానం చేయగలడు
  • ‘మమ్మల్ని పిలవలేదు’ అంటే..మళ్లీ మీకే వేదికలు వేయాలా?
  • మీడియాతో నందిని సిధారెడ్డి

హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. తెలుగు మహాసభలకు హాజరు కావాలంటూ నాడు ఆహ్వానం అందిన వారిలో మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు కూడా ఉన్నారు. అయితే, ఈ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించని కారణంగానే ఈ మహాసభలకు తాను హాజరుకానని  ఆయన స్పష్టం చేసిన విషయం విదితమే. అయితే, ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి స్పందించారు.

‘మా తెలంగాణ రాష్ట్రంలో ఎట్టా చెయ్యాలో వాళ్లు చెప్పనక్కర్లేదు. గత ఆరు దశాబ్దాల నుంచి విస్మరించబడినట్టి సాహిత్య, భావోద్వేగాల్లో నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. విస్మరించబడినటువంటి స్థితిని సుస్థిర పరిచే ప్రయత్నం జరుగుతోంది. ‘మమ్మల్ని పిలవలేదు’ అంటే..మళ్లీ మీకే వేదికలు వేసేందుకు మేము సభలు పెట్టాల్సిన అవసరం లేదు.. ఇంకా, గరికపాటినే మోయదలచుకోలేదు. మేము గౌరీభట్ల మెట్టు రామశర్మ శతావధానం చేస్తుంటే, చూడాలని, వినాలని ఉవ్విళ్లూరి సభ పెట్టుకున్నాం. మళ్లీ, గరికపాటి అవధానం పెడితే..మెట్టు రామశర్మ ఎటుపోతాడు? కాబట్టి, మా మెట్టు రామశర్మ కూడా శతావధానం చేయగలడు అనే టటువంటి ఒక ధైర్యంతో, సాహసంతో ఆ సభ నిర్వహించాం. అక్కడికి నువ్వు (గరికపాటి) రావడం, రాకపోవడమనేది నీ విజ్ఞత, సహృదయానికి సంబంధించిన అంశం’ అని సిధారెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News