ఆ నిర్మాతకి నాతో నటించాలనేది పిచ్చి .. అందుకే ఆ సినిమా తీశారు!: జమున
- డీఎల్ గారిని వెంటబెట్టుకుని సీతారామ్ వచ్చారు
- సీతారామ్ ను డీఎల్ పరిచయం చేశారు
- భారీ సినిమా తీయనున్నట్టు చెప్పారు
- నా జోడీ సీతారామ్ అని తెలిసి చేయనన్నాను
"ఆయనను నాకు డీఎల్ గారు పరిచయం చేశారు. చాలా పెద్ద సినిమా తీస్తున్నారని చెప్పి .. ఎన్టీఆర్ - భానుమతి ఒక జంట, మీరు ఈయన ఒక జంట అని అన్నారు. దాంతో 'అయ్య బాబోయ్ నేను చెయ్యను' అనేశాను. 'కాంబినేషన్ కరెక్ట్ గా లేకపోతే .. ఈ సినిమా డబ్బాలు వెనక్కి వచ్చేస్తాయి' అని చెప్పాను. అయినా వినిపించుకోకుండా ఆయన .. డీఎల్ గారు రోజూ వచ్చి బ్రతిమాలేవారు. 'చెయ్యమ్మా .. లేకపోతే ఆయన ఉరేసుకుని చనిపోయేలా వున్నాడు' అంటూ డీఎల్ గారు ఒప్పిస్తే చివరికి చేశాను" అంటూ చెప్పుకొచ్చారు.