uganda t20 league: ఉగాండా దేశానికి వెళ్లి నానా బాధలు పడ్డ పాకిస్థాన్ క్రికెటర్లు

  • టీ20లీగ్ ఆడేందుకు ఉగాండా వెళ్లిన పాక్ క్రికెటర్లు
  • అప్పటికే లీగ్ ను రద్దు చేసిన బోర్డు.. కాంట్రాక్ట్ డబ్బులు కూడా చెల్లించని వైనం
  • షాక్ కు గరైన పాక్ ఆటగాళ్లు

ఓ టీ20 లీగ్ లో ఆడేందుకు ఆఫ్రికా దేశం ఉగాండాకు వెళ్లిన పాకిస్థాన్ క్రికెటర్లకు చుక్కలు కనిపించాయి. వివరాల్లోకి వెళ్తే, ఆఫ్రో టీ20 కప్ లో ఆడేందుకు పాక్ క్రికెట్ బోర్డుతో ఉగాండా క్రికెట్ బోర్డు ఒప్పందం చేసుకుంది. దీనికి ఐసీసీ గుర్తింపు కూడా ఉంది. ఇందులో భాగంగా టోర్నీలో పాల్గొనేందుకు పాక్ కు చెందిన 20 మంది టాప్ క్రికెటర్లు ఉగాండా చేరుకున్నారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత కానీ, వారికి తెలియలేదు, లీగ్ ను రద్దు చేశారని!

అంతేకాదు, కాంట్రాక్ట్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ఆర్గనైజర్లు చెల్లించలేదు. చివరి నిమిషంలో లీగ్ స్పాన్సర్ తప్పుకోవడంతో అక్కడి బోర్డు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో, మీకు కాంట్రాక్టు డబ్బులు కూడా చెల్లించలేమంటూ చేతులు ఎత్తేసింది. లీగ్ ఆర్గనైజర్లు డబ్బులు చెల్లించకపోవడంతో విమాన సంస్థ టికెట్లను కూడా రద్దు చేసింది. దీంతో, పాక్ ఎంబసీ, పీసీబీ సహకారంతో వీరంతా పాక్ కు తిరిగి చేరుకున్నారు. మరోవైపు, ఈ ఘటనపై పాక్ క్రికెట్ బోర్డు సీరియస్ అయింది. విచారణకు ఆదేశించింది.

More Telugu News