Kurnool: క్లర్క్ శశికళపై కోపంతో అమ్మాయిలతో కిడ్నాప్ డ్రామా ఆడించిన హెచ్ఎం సరోజిని

  • కిడ్నాప్ ఉదంతం అంతా డ్రామాయే
  • శశికళను కేసులో ఇరికించేందుకు సరోజిని యత్నం
  • తప్పుడు కేసు పెట్టినందుకు చర్యలు

కర్నూలు జిల్లా పత్తికొండలో కలకలం రేపిన ఆరుగురు విద్యార్థినుల కిడ్నాప్ ఉదంతాన్ని చివరికి డ్రామాగా తేల్చారు పోలీసులు. వారు చదివే స్కూల్ లోని ప్రధానోపాధ్యాయురాలు సరోజిని ఈ డ్రామా వెనుక ప్రధానపాత్ర పోషించిందని, అదే పాఠశాలలో క్లర్క్ గా పనిచేసే శశికళపై ఉన్న కోపంతో ఆమె ఈ పని చేయించిందని పోలీసులు వెల్లడించారు.

పిల్లలతో కిడ్నాప్ డ్రామా ఆడించి, ఈ కేసులో శశికళను ఇరికించాలన్నది సరోజిని ప్లాన్ అని తమ విచారణలో వెల్లడైనట్టు తెలిపారు. సరోజినికి, శశికళకు మధ్య విభేదాలు ఉన్నాయని, పగ తీర్చుకునేందుకు సరోజిని అమ్మాయిలతో మాట్లాడి ఇలా డ్రామా ఆడించి ఫిర్యాదు చేసిందని, తప్పుడు ఫిర్యాదు ఇచ్చినందుకు ఆమెపై కేసు పెట్టామని, శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేయనున్నామని పోలీసు అధికారులు తెలిపారు. విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News