Sandhyarani: నేను ఫోన్ చేస్తుంటే, సంధ్య లవర్ ఫోన్ ఎత్తేవాడు: ఆగ్రహంతోనే నిప్పంటించానన్న కార్తీక్

  • ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను
  • మూడేళ్ల నుంచి పరిచయం ఉంది
  • దూరం పెట్టిందన్న ఆగ్రహంతోనే నిప్పంటించా
  • పోలీసుల విచారణలో కార్తీక్

తాను సంధ్యారాణిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానని, తరువాత కాదనడంతో తట్టుకోలేకనే ఇంత దారుణానికి ఒడిగట్టానని, నడిరోడ్డుపై యువతిని దహనం చేసిన కార్తీక్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. సంధ్యతో మూడేళ్ల నుంచి పరిచయం ఉందని చెప్పిన కార్తీక్, ఇటీవలి కాలంలో ఆమె తనను దూరం పెట్టిందని చెప్పాడు. ఈ క్రమంలో మరో యువకుడికి దగ్గరై, తనతో మాట్లాడటం మానేసిందని, సంధ్యకు ఫోన్ చేస్తే, అతనే లిఫ్ట్ చేస్తుండేవాడని, సంధ్య జోలికి రావద్దని బెదిరించాడని పోలీసుల విచారణలో కార్తీక్ వెల్లడించాడు.

తన కొలీగ్ తో ఆమె ప్రేమలోపడి అతనితో సన్నిహితంగా ఉండటంతో తానెంతో కుమిలిపోయానని, తనను అవాయిడ్ చేసినందుకే ఈ పని చేశానని చెప్పాడు. కాగా, సంధ్యారాణి ఈ ఉదయం 7 గంటల సమయంలో మృతిచెందినట్టు డీసీపీ సుమతి పేర్కొన్నారు. నిందితుడిపై హత్య, వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టి కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News