Sandhyarani: ఉన్మాది ఘాతుకానికి బలైన సంధ్యారాణి కన్నుమూత

  • నడిరోడ్డుపై పెట్రోలు పోసి నిప్పంటించిన కార్తీక్
  • తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి
  • హత్య కేసు నమోదు చేసిన పోలీసులు

తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఉన్మాదిగా మారిన ఓ దుర్మార్గుడు పెట్రోలు పోసి నిప్పంటించగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి ఈ ఉదయం కన్నుమూసింది. హైదరాబాద్ లోని లాలాపేట ప్రాంతంకు చెందిన సంధ్యారాణిని ప్రేమిస్తూ వచ్చిన కార్తీక్ అనే యువకుడు, ఆమె తనను తిరస్కరించిందన్న కారణంతో, నడిరోడ్డుపై ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే.

నిన్న సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో లాలాపేట అంబేద్కర్ విగ్రహం వద్ద కార్తీక్ ఈ ఘాతుకానికి పాల్పడగా, 70 శాతం కాలిన గాయాలతో బాధితురాలు, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో కార్తీక్ ఆ వెంటనే లొంగిపోగా, అతనిపై పెట్టిన హత్యాయత్నం కేసును, ఇప్పుడు హత్య కేసుగా మార్చనున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.  

  • Loading...

More Telugu News