ananthapuram: ‘నా అనుచరుడిని అరెస్టు చేస్తారా?’ అంటూ పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే జేసీ వీరంగం!

  • మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలకు జేసీ అనుచరుడు శివనాయుడు ఫోన్ బెదిరింపులు
  • ఫిర్యాదు మేరకు శివనాయుడు అరెస్టు
  • తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే జేసి వీరంగం

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై నగర మేయర్ స్వరూప నిన్న తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విమర్శల నేపథ్యంలో స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలకు టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు శివనాయుడు ఫోన్ చేసి బెదిరించారు. ఈ నేపథ్యంలో స్వరూప, ప్రభాకర్ చౌదరిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, తాడిపత్రి పోలీసులు శివనాయుడిని అరెస్టు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ‘నా అనుచరుడిని అరెస్టు చేస్తారా?’ అంటూ వీరంగం సృష్టించారు. కాగా, ఈ విషయమై తాడిపత్రి సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ, శివనాయుడిని అరెస్టు చేసిన మాట వాస్తవమేనని, అయితే, స్టేషన్ బెయిల్ పై ఆయన్ని విడుదల చేశామని చెప్పారు. 

More Telugu News