Gujarath: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా!

  • రూపానీతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులూ రాజీనామా
  • రాజీనామా లేఖలు గవర్నర్ కు అందజేత
  • కొత్త సీఎం ఎవరనే విషయం ఇంకా తేలని వైనం!
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి నితిన్ పటేల్, మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీకి సమర్పించారు. అయితే, గుజరాత్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన్ని గవర్నర్ కోరడం జరిగింది. 

కాగా, గుజరాత్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా, గుజరాత్ కొత్త సీఎంగా ఎవరనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎవరనే విషయం ఆదివారం తెలుస్తుందని, ఆ మర్నాడు గుజరాత్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరుతుందని బీజేపీ వర్గాల సమాచారం. 
Gujarath
vijayrupani

More Telugu News