hello: ‘ట్విట్టర్ ’ ఖాతా తెరిచిన ‘హలో’ హీరోయిన్ కల్యాణి !

  • ‘హలో’ చిత్రంలోని తన స్టిల్ ను పోస్ట్ చేసిన కల్యాణి
  • ఎట్టకేలకు ‘ట్విట్టర్’ ఎలా వాడాలో నేర్చుకున్నా
  • ‘సరిగ్గానే వాడుతున్నాను కదా!’ అంటున్న కథానాయిక

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అఖిల్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన చిత్రం ‘హలో’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర కథానాయిక కల్యాణి తాజాగా తన ‘ట్విట్టర్’ ఖాతాను తెరిచింది. ఈ సందర్భంగా ‘హలో’ చిత్రంలోని తన స్టిల్ ను పోస్ట్ చేసింది. వయోలిన్ వాయిస్తున్న కల్యాణి ఈ ఫొటోలో కనబడుతుంది. ‘హలో..ఎట్టకేలకు ‘ట్విట్టర్’ ఎలా వాడాలో నేర్చుకున్నాను. సరిగ్గానే వాడుతున్నాను కదా!’ అని తన ట్వీట్ లో తన అభిమానులను ప్రశ్నించింది. కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

More Telugu News