guinness: ఒక్క నిమిషంలో 122 కొబ్బ‌రి కాయ‌లు చేతితో పగుల‌గొట్టి రికార్డు... వీడియో చూడండి!

  • గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న కేర‌ళ వ్య‌క్తి
  • ఫిబ్ర‌వ‌రిలో రికార్డు వీడియోను ఇటీవ‌ల అప్‌లోడ్ చేసిన గిన్నిస్‌
  • గ‌త రికార్డు 118 కొబ్బ‌రి కాయ‌లు

కేర‌ళ‌కు చెందిన అబీష్ పి డామినిక్ ఒక్క నిమిషంలో 122 కొబ్బ‌రి కాయ‌లు చేతితో ప‌గులగొట్టి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో కొట్టాయం ప్రాంతంలో డామినిక్ ఈ రికార్డు నెల‌కొల్పారు. కాగా.. ఈ రికార్డుకి సంబంధించిన వీడియోను గిన్నిస్‌బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్ ఇటీవ‌ల త‌మ అధికారిక యూట్యూబ్ ఛాన‌ల్‌లో అప్‌లోడ్ చేసింది. గ‌త రికార్డు 118 కొబ్బ‌రికాయ‌ల‌ను డామినిక్ బ‌ద్ద‌లు కొట్ట‌డం ఈ వీడియోలో చూడొచ్చు.

మొత్తం 140 కొబ్బ‌రికాయ‌ల్లో 122 కాయ‌ల‌ను ఒక్క నిమిషంలో డామినిక్ ప‌గుల‌గొట్టాడు. అంటే తన కుడిచేతి పిడికిలితో ఒక్క సెక‌నులో డామినిక్ రెండు కొబ్బ‌రి కాయ‌లు ప‌గుల‌గొట్టాడ‌న్నమాట‌.

  • Loading...

More Telugu News