Hyderabad: హైద‌రాబాద్‌లో దీక్ష‌కు దిగిన మోత్కుప‌ల్లి అరెస్ట్‌.. భావోద్వేగంతో క‌న్నీరు పెట్టుకున్న నేత‌!

  • ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ ట్యాంక్ బండ్ వ‌ద్ద నిర‌స‌న‌
  • కేసీఆర్ నియంతృత్వ పోకడకు ఇదే నిదర్శనం అంటూ మోత్కుప‌ల్లి ఉద్విగ్నం
  • అణగదొక్కడానికి ప్ర‌య‌త్నిస్తే మాత్రం తిరగబడతాం

ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ టీటీడీపీ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు నిర‌స‌న దీక్ష‌కు దిగ‌డంతో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతోన్న‌ మంద కృష్ణ మాదిగ‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే.

 ఈ నేప‌థ్యంలోనే హైద‌రాబాద్‌లోని ట్యాంక్ బండ్ వ‌ద్ద అంబేద్క‌ర్ విగ్ర‌హం ముందు మోత్కుప‌ల్లి దీక్ష‌కు దిగారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడకు ఇదే నిదర్శనమంటూ భావోద్వేగానికి గురై ఆయ‌న క‌న్నీరు పెట్టుకున్నారు. తాము కేసీఆర్‌కు వ్యతిరేకం కాదని, అయితే, తమ‌ను ఇలా అరెస్టులు చేసి అణగదొక్కడానికి ప్ర‌య‌త్నిస్తే మాత్రం తిరగబడతామ‌ని అన్నారు. కాగా, మోత్కుప‌ల్లిని పోలీసులు రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News