kareena kapoor: ఘ‌నంగా క‌రీనా, సైఫ్‌ల కుమారుడు తైమూర్ మొద‌టి పుట్టిన‌రోజు... ఇవిగో ఫొటోలు!

  • ప‌టౌడీ ప్యాలెస్‌లో వేడుకలు
  • హాజ‌రైన క‌పూర్, ప‌టౌడీలు
  • చిన్నారికి వినూత్నమైన బ‌హుమ‌తి 

సైఫ్ అలీ ఖాన్‌, క‌రీనా క‌పూర్ ముద్దుల త‌న‌యుడు, ప‌టౌడీ వార‌సుడు తైమూర్ అలీఖాన్ మొద‌టి పుట్టిన‌రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. హ‌ర్యానాలోని ప‌టౌడీ ప్యాలెస్‌లో ఈ వేడుక‌లు జ‌రిగాయి. ఇందుకోసం నాలుగు రోజుల ముందే కపూర్‌, ప‌టౌడీ కుటుంబీకులు హర్యానా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ప‌ల్లె వాతావ‌ర‌ణంలో వారు సేదదీరుతున్న ఫొటోల‌ను క‌రీనా, క‌రిష్మా క‌పూర్‌లు ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం రోజు జ‌రిగిన పుట్టిన రోజు వేడుక ఫొటోల‌ను కూడా స‌న్నిహితులు షేర్ చేశారు. తైమూర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌నికి  ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివాకర్ 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వుండే ఓ చిన్న అడ‌వి లాంటి ప్రదేశాన్ని బ‌హుమ‌తిగా ఇచ్చారు. ఇందులో రకరకాల మొక్కలను నాటి పెంచుతున్నారు. మహారాష్ట్ర పాల్ఘర్‌ ప్రాంతంలోని సొనావేలో ఈ అడ‌వి ఉంది. ఈ విష‌యాన్ని రుజుత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు.


   

  • Loading...

More Telugu News