pavan kalyan: క్రిస్మస్ మరుసటి రోజునే 'అజ్ఞాతవాసి' ట్రైలర్

  • 'అజ్ఞాతవాసి' టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ 
  • ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది 
  • 29వ తేదీన సెన్సార్ కార్యక్రమాలు
  • జనవరి 10వ తేదీన విడుదల  

'అజ్ఞాతవాసి' సినిమాపైనే ఇప్పుడు సినీ ప్రియులు దృష్టి పెట్టారు. ఈ నెల 16వ తేదీన వదిలిన ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక 19వ తేదీన జరిగిన ఆడియో వేడుక కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 25వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలాలనుకున్నారు. కానీ తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ ట్రైలర్ ను క్రిస్మస్ మరుసటి రోజున, అంటే 26వ తేదీన విడుదల చేయనున్నారట.

పవన్ కల్యాణ్ చెప్పిన ఓ పవర్ఫుల్ డైలాగ్ పై ఈ ట్రైలర్ ను కట్ చేస్తున్నట్టుగా సమాచారం. పవన్ ఫ్యాన్స్ మెచ్చేలా .. సినిమాపై మరింత భారీగా అంచనాలు పెరిగేలా ఈ ట్రైలర్ ఉండనుందట. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, వచ్చేనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ జోడీగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్నారు.   

More Telugu News