sai pallavi: ఎప్పటి నుంచో కంటోన్న కల .. ఇప్పుడు నెరవేరింది: సాయిపల్లవి

  • నా ఫేవరేట్ హీరో సూర్య 
  • ఆ మూవీ నుంచి ఆయనకు అభిమానిగా మారిపోయాను 
  • ఆయన సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేశాను  
తెలుగులో ఇప్పుడు మంచి క్రేజ్ వున్న కథానాయికలలో సాయిపల్లవి ఒకరు. యువ కథానాయకులు తమ సినిమాలో ఆమె ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, దర్శక నిర్మాతలు కూడా ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులోనే కాదు .. తమిళంలోను ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. అలా తాజాగా ఆమె సూర్య సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే.

 ఈ విషయం గురించి తాజాగా సాయిపల్లవి మాట్లాడుతూ .. " సూర్య నా ఫేవరేట్ హీరో .. ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం. 'కాక్క కాక్క' (తెలుగులో వెంకటేష్ తో 'ఘర్షణ' పేరుతో రీమేక్ చేశారు) సినిమా చేసిన దగ్గర నుంచి నేను ఆయనకు అభిమానిగా మారిపోయాను. ఆయనతో కలిసి ఒక సినిమా చేసినా చాలు అనుకుంటూ కలలు కనే దానిని. అయితే అది త్వరగా నెరవేరదనే అనుకున్నాను. కానీ సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య సరసన నటించే ఛాన్స్ వచ్చింది. ఇది నిజంగా నా అదృష్టం .. నా కల నెరవేరినందుకు ఆనందంగా వుంది" అంటూ చెప్పుకొచ్చింది.    
sai pallavi

More Telugu News