Hyderabad: హైద‌రాబాద్‌లో అఖిల్ 'హ‌లో' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌.. హాజ‌రైన‌ చిరు, చెర్రీ, చైతూ, స‌మంత‌!

  • ఎల్లుండి 'హ‌లో' విడుద‌ల‌
  • ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌ల‌కు మంచి స్పంద‌న‌
  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో

హైద‌రాబాద్‌లోని హైటెక్స్, ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్‌లో అఖిల్ 'హ‌లో' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రుగుతోంది. ఈ ప్రోగ్రాంకి మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య‌, న‌టి స‌మంత హాజ‌ర‌య్యారు. ఈ ప్రోగ్రాంలో 'హ‌లో' సినిమా బృందంతో పాటు న‌టులు అక్కినేని నాగార్జున‌, సుమంత్‌, ప‌లువురు సినీప్ర‌ముఖులు పాల్గొంటున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హలో' సినిమా ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవ‌ల విడుద‌లైన‌ ఈ సినిమా ట్రైల‌ర్‌, పాట‌లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా, రేపు నాని 'ఎమ్‌సీఏ' చిత్రం కూడా విడుద‌లవుతోన్న విష‌యం తెలిసిందే.

More Telugu News