jio tv: ఆవిష్క‌రించిన కాసేపట్లోనే ఆగిపోయిన‌ జియో టీవీ వెబ్ వెర్ష‌న్

  • సాంకేతిక లోపాలే కార‌ణం
  • 'అండ‌ర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్' మెసేజ్ చూపిస్తున్న సైట్‌
  • స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణకు సంవత్స‌రం ప‌ట్టే అవ‌కాశం?

425కి పైగా లైవ్‌ ఛాన‌ళ్ల‌ను ప్ర‌సారం చేసే జియో టీవీని డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లలో ఇంట‌ర్నెట్ ద్వారా ఉచితంగా చూసుకునే అవ‌కాశాన్ని కల్పిస్తున్నట్టు ఇటీవల జియో ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వెబ్‌సైట్‌ని ఆవిష్క‌రించిన కాసేపట్లోనే సాంకేతిక కార‌ణాల దృష్ట్యా నిలిపివేశారు. ప్ర‌స్తుతం ఆ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే 'అండ‌ర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్' మెసేజ్ చూపిస్తోంది.

జియో టీవీ వెబ్ వెర్ష‌న్‌లో త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి, తిరిగి టీవీ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డానికి దాదాపు సంవ‌త్స‌ర‌కాలం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని జియో సాంకేతిక వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండ‌గా, ఈ వెబ్‌సైట్‌తో పాటు ఆవిష్క‌రించిన జియోసినిమా వెబ్‌సైట్ ఎలాంటి అవాంత‌రాలు లేకుండా ప‌నిచేస్తోంది. ఈ వెబ్‌సైట్ ద్వారా టీవీ షోలు, సినిమాలు చూసుకోవ‌చ్చు. అందుకోసం జియో నెంబ‌ర్‌తో గానీ, జియో ఐడీతో గానీ ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

More Telugu News