krishnamraju: సావిత్రి .. వాణిశ్రీ .. జయసుధ నా అభిమాన తారలు: కృష్ణంరాజు

  • సావిత్రి గారంటే ఇష్టం 
  • వాణిశ్రీ నటన అద్భుతం 
  • ఆ తరువాత స్థానంలో జయసుధ

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు పాల్గొనగా .. " ఇప్పటి వరకూ మీతో కలిసి నటించిన హీరోయిన్స్ లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన వారెవరు?" అనే ప్రశ్న కృష్ణంరాజుకు ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. " మా సొంత సినిమాలు చేసిందని చెప్పడం కాదు గానీ .. వాణిశ్రీ అంటే ఇష్టం. 'కృష్ణవేణి' నిర్మాతగా నా ఫస్టు సినిమా .. నేను హీరో .. ఆమె హీరోయిన్"

"అందులో ఆమె చేసిన నటన మామూలుగా ఉండదు .. అద్భుతం. ఆ తరువాత కూడా ఆ పాత్రలో ఆమె లీనమైపోయేది. తరువాత 'భక్త కన్నప్ప'లో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. దర్శకుడు ఊహించినదానికంటే ఎక్కువగా ఆమె ఎక్స్ ప్రెషన్స్ .. డైలాగ్స్ చెప్పే తీరు వుండేవి. సావిత్రి గారంటే నాకు చాలా ఇష్టం .. ఆ తరువాత వాణిశ్రీని నేను ఆర్టిస్ట్ గా గౌరవించాను .. ఆ తరువాత జయసుధ నటన ఆకట్టుకుంది" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News