prabhas: స్వీటీ.. గుడ్ లక్: 'భాగమతి' అనుష్కకు ప్రభాస్ విషెస్

  • 'భాగమతి' టీజర్ విడుదల
  • అనుష్కకు గుడ్ లక్ చెప్పిన ప్రభాస్
  • కొత్తదనం కోసం అనుష్క ప్రయత్నిస్తూనే ఉంటుందని కితాబు
అనుష్క నటించిన 'భాగమతి' సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు. అనుష్కపై ప్రశంసలు కురిపించాడు. "ప్రతి సినిమాలో కొత్తగా కనిపించేందుకు అనుష్క ప్రయత్నిస్తూనే ఉంటుంది. గుడ్ లక్ స్వీటీ. గుడ్ లక్ యూవీ క్రియేషన్స్" అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతోపాటు 'భాగమతి' టీజర్ ను కూడా అప్ లోడ్ చేశాడు.
prabhas
Anushka Shetty
tollywood
bhagamathi movie

More Telugu News