Ram Nath Kovind: అమరావతిలో పర్యటించనున్న రాష్ట్రపతి కోవింద్.. భారీ భద్రతా ఏర్పాట్లు

  • ఈ నెల 27న అమరావతికి కోవింద్
  • నాగార్జున యూనివర్శిటీలో సదస్సుకు హాజరు 
  • ఫైబర్ గ్రిడ్ కు ప్రారంభోత్సవం
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. ఈ నెల 27వ తేదీన ఆయన అమరావతిలో పర్యటిస్తారని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు. పర్యటనలో భాగంగా తొలుత ఆయన ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద ఏర్పాటు చేసిన ఎకనామిక్ సదస్సులో పాల్గొంటారని... ఆ తర్వాత వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారని తెలిపారు.

 సచివాలయం మొదటి భవనంలో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ను పరిశీలిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అప్పలనాయుడు తెలిపారు.
Ram Nath Kovind
amaravathi

More Telugu News