kavitha: క‌రీంన‌గ‌ర్ జిల్లా కురిక్యాల‌లో 'కంద' ప‌ద్యం పుట్టింది!: కవిత‌

  • ర‌వీంద్ర భార‌తిలో ఐదో రోజు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు
  • నన్నయ కంటే ముందే తెలంగాణలో కావ్య రచన జరిగింది
  • క‌రీంన‌గ‌ర్ జిల్లా కురిక్యాల‌లో కంద ప‌ద్యం పుట్టింది
  • ప్రాచీన తెలంగాణ కవులపై జాగృతి తరఫున పుస్తకాలు ముద్రిస్తాం 

హైదరాబాద్‌లోని ర‌వీంద్ర భార‌తిలో ఐదో రోజు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు కొన‌సాగుతున్నాయి. యశోదారెడ్డి ప్రాంగ‌ణంలో విదేశీ తెలుగు వారితో చ‌ర్చాగోష్ఠి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ప్ర‌వాస భార‌తీయుడు నారాయ‌ణ స్వామి అధ్య‌క్ష‌త‌న ఈ సమావేశం కొన‌సాగుతోంది. ఈ స‌మావేశానికి ఎంపీ క‌విత‌, సినీన‌టుడు త‌నికెళ్ల భ‌ర‌ణి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ... నన్నయ కంటే ముందే తెలంగాణలో కావ్య రచన జరిగిందని తెలిపారు. అలాగే క‌రీంన‌గ‌ర్ జిల్లా కురిక్యాల‌లో కంద ప‌ద్యం పుట్టింద‌ని చెప్పారు. తెలుగు సాహిత్యంలో వేములవాడ సాహిత్యయుగం కీల‌క‌మైంద‌ని తెలిపారు.

తెలుగు అనే ప‌దాన్ని మొద‌ట వాడిన క‌వి పాల్కురికి సోమ‌నాథుడ‌ని క‌విత అన్నారు. ప్రాచీన తెలంగాణ కవులపై త‌మ‌ జాగృతి తరఫున పుస్తకాలు ముద్రించి, వాటిని విదేశాల్లో ఉన్న తెలుగువారికి పంపిణీ చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని పాఠ‌శాల‌ల్లో తెలుగు స‌బ్జెక్ట్‌ను తప్పనిసరి చేసింద‌ని తెలిపారు. విదేశాల్లో తెలుగు కోసం కృషి చేస్తోన్న తెలుగు వారంద‌రినీ తాము వెతికామ‌ని, 42 దేశాల నుంచి తెలుగు వారు ఈ స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యార‌ని చెప్పారు.                    

  • Loading...

More Telugu News