nani: పుకార్ల‌ని న‌మ్మ‌కండి.. విభేదాలు లేవు.. ఎమ్‌సీఏ, హ‌లో సినిమాల విడుద‌ల‌పై నాని

  • నాని 'ఎమ్‌సీఏ' సినిమా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు
  • ఈ నెల 22న అఖిల్ న‌టించిన 'హ‌లో' సినిమా విడుద‌ల
  • నాగార్జున‌, దిల్‌రాజుకి విభేదాలంటూ ప్ర‌చారం
  • పోటీ లేద‌ని చెప్పిన నాని

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన 'ఎమ్‌సీఏ' సినిమా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ నెల 22న అక్కినేని వార‌బ్బాయి అఖిల్ న‌టించిన హ‌లో సినిమా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ యువ క‌థానాయ‌కులదే సంద‌డి. అయితే, ఈ నేప‌థ్యంలో ఓ వదంతి వ్యాపిస్తోంది. 'ఎమ్‌సీఏ' సినిమా నిర్మాత దిల్‌రాజుకి, హ‌లో సినిమాను నిర్మించిన నాగార్జున‌కి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని గాసిప్స్ వ‌స్తున్నాయి. ఈ ప్ర‌చారంపై నాని స్పందించాడు. కొంద‌రు అనుకుంటున్న‌ట్లు త‌మ సినిమాల‌కు పోటీ లేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో అన్నాడు.

త‌న సినిమాతో పాటు అఖిల్ సినిమా హిట్ అవుతుందని నాని చెప్పాడు. త‌న ఎమ్‌సీఏ ట్రైల‌ర్ బాగుంద‌ని అఖిల్ త‌న‌కు ఫోన్ చేసి చెప్పాడ‌ని తెలిపాడు. తాను కూడా 'హ‌లో' సినిమా ట్రైల‌ర్ చూసిన వెంట‌నే అఖిల్‌కి కాల్ చేశాన‌ని అన్నాడు. ఈ రెండు సినిమాల మ‌ధ్య పోటీ అంటూ, కొంద‌రి మ‌ధ్య విభేదాలు అంటూ ఎన్నో రూమ‌ర్స్ వ‌స్తున్నాయ‌ని చెప్పాడు. ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం దేనిని ఎక్కువ‌గా ఆద‌రిస్తారో అదే హిట్ అవుతుందని చెప్పాడు. 2017లో తెలుగు సినిమాలు మంచి స‌క్సెస్ రేటుని అందుకున్నాయ‌ని, వ‌చ్చే ఏడాది కూడా ఇలాగే మంచి విజ‌యాలు అందుకోవాల‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపాడు.    

More Telugu News