Kadapa: 'కడపను తిరగేస్తే పడక'... కలకలం రేపుతున్న వర్మ టైటిల్ సాంగ్ లిరిక్స్... వీడియో చూడండి!

  • కడప వెబ్ సిరీస్ పాట విడుదల
  • సిరాశ్రీ రచించిన పాట
  • సోషల్ మీడియాలో వైరల్

తాను తీస్తున్న వెబ్ సిరీస్ 'కడప' టైటిల్ సాంగ్ ను ఈ ఉదయం 9 గంటల సమయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశాడు. ఈ పాటలోని లిరిక్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ పాటను సిరాశ్రీ రాశారు.

"కడప కడప కడప కడప కడప కడప కడప
అది యమద్వారపు గడప
కడప కడప కడప కడప కడప కడప కడప
అది బలిపీటపు గడప
కడపంటే ఫ్యాక్షన్, కడపంటే యాక్షన్
కడపంటే ఓ టెన్షన్, కడపే అటెన్షన్
కడపంటే ఊరు కాదు... బాంబురా కొడకా
కడపంటే పేరు కాదు... మృత్యువురా కొడకా
కడపకెదిరి తొడగొడితే గోతిలోనే పడక
కడపను తిరగేస్తే పడక కానీ అది చావు కొడకా...!"
అంటూ సాగుతున్న ఈ పాటపై ఇంకెన్ని విమర్శలు వస్తాయో!
వర్మ విడుదల చేసిన ఈ పాటను మీరూ చూడవచ్చు.

More Telugu News