Narendra Modi: మోదీకి సొంత నియోజకవర్గంలో షాక్.. పరాజయం పాలైన బీజేపీ అభ్యర్థి

  • బీజేపీ అభ్యర్థిని మట్టికరిపించిన కాంగ్రెస్ అభ్యర్థి
  • బీజేపీలో చర్చనీయాంశంగా ఓటమి
  • గత ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న కాంగ్రెస్

గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ.. ప్రధాని మోదీ స్వగ్రామం వాద్‌నగర్ ఉండే ఉంఝా నియోజకవర్గంలో మాత్రం ఓటమిపాలవడం చర్చనీయాంశమైంది. ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నారాయణ్‌భాయ్ లల్లుదాస్, కాంగ్రెస్ అభ్యర్థి ఆశా పటేల్ చేతిలో 19,529 ఓట్లతో ఓటమి పాలయ్యారు.

ఆశాపటేల్‌కు 81,797 ఓట్లు పోలవగా, నారాయణ్‌భాయ్‌కు 62,268 ఓట్లు పోలయ్యాయి. కాగా, 2012 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి వీరిద్దరూ పోటీపడగా, అప్పట్లో ఆశా పటేల్ 25 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నవసర్జన్ యాత్రలో భాగంగా ఉంఝా నియోజకవర్గంలో పర్యటించారు. వాద్‌నగర్ సమీపంలో ఉండే ఉమియా మాత ఆలయాన్ని సందర్శించారు.

  • Loading...

More Telugu News