Congress: బీజేపీ ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో అనైతిక రాజ‌కీయాల‌కు పాల్ప‌డింది: ర‌ఘువీరారెడ్డి

  • నైతిక విజ‌యం కాంగ్రెస్‌దే
  • గుజ‌రాత్‌లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును గౌర‌విస్తున్నాం
  • కేవ‌లం 9 సీట్ల తేడాతో మాత్ర‌మే మా పార్టీ అధికారానికి దూర‌మైంది

గుజ‌రాత్‌లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును గౌర‌విస్తున్నామ‌ని, కేవ‌లం 9 సీట్ల తేడాతో మాత్ర‌మే త‌మ పార్టీ అధికారానికి దూర‌మైంద‌ని నైతిక విజ‌యం త‌మ పార్టీదేన‌ని ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి అన్నారు. బీజేపీ ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో అనైతిక రాజ‌కీయాల‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను కీల‌క ద‌శ‌లో భుజానికెత్తుకున్నార‌ని చెప్పారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేగ‌లిగే స‌త్తా ఆయ‌న‌కు ఉంద‌ని ప్ర‌శంసించారు. నేటి యువ‌త‌కు రాహుల్ గాంధీ ఆద‌ర్శ‌మ‌ని, రాజ‌కీయాలంటే ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే విధంగా ఉండాల‌ని ఆయ‌న అంటార‌ని చెప్పారు.

More Telugu News