hindu: అందుకే అంద‌రూ ఆర్ఎస్ఎస్‌లో చేరండి: మోహ‌న్ భ‌గ‌వ‌త్ పిలుపు

  • జాతి నిర్మాణంతో పాటు స్వీయ అభివృద్ధి కోసం చేరాలి
  • భార‌త్‌లో నివసిస్తున్నవారంతా హిందువులే
  • భారత్ అంటే హిందువుల భూమి
  • దేశంలోని ముస్లింలు కూడా హిందువులే

భార‌త్‌లో నివసిస్తున్నవారంతా హిందువులేనని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్ఎస్ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్ అన్నారు. త్రిపురలో పర్యటిస్తోన్న ఆయన ఈ రోజు మాట్లాడుతూ... త‌మ‌కు ఎవరితోనూ శత్రుత్వం లేదని, అందరి సంక్షేమమే త‌మ‌కు కావాలని అన్నారు. భారత్ అంటే హిందువుల భూమి అని, ప్రపంచంలో ఎక్కడెక్కడో వేధింపులకు గురైన హిందువులు ఇక్కడకు వచ్చి ఆశ్రయం పొందారని తెలిపారు.

1947లో దేశ విభజన జరగడంతో హిందుత్వ స్ఫూర్తి బలహీనపడిందని తెలిపారు. దేశంలోని ముస్లింలు కూడా హిందువులేనని వ్యాఖ్యానించారు. జాతి నిర్మాణంతో పాటు స్వీయ అభివృద్ధి కోసం సిద్ధ‌మ‌య్యేందుకు హిందువులంతా ఆర్ఎస్ఎస్‌లో చేరాల‌ని పిలుపునిచ్చారు.    

  • Loading...

More Telugu News