Prakash Raj: ప్రకాశ్ రాజ్... ఏంది నీ గోల?: దర్శక నిర్మాత మధుర శ్రీధర్ ఫైర్

  • నీ అహంకారంతో నిర్మాతలు, దర్శకులను ఇబ్బంది పెట్టావు
  • నీవు సంతోషంగా ఉన్నావా?
  • హెడ్ లైన్లలో నిలవాలని ప్రయత్నించకు
గుజరాత్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ అందుకున్న తరుణంలో ప్రధాని మోదీని ఉద్దేశించి నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. 'గుజరాత్ లో 150కి పైగా సీట్లు సాధిస్తామని అన్నారుగా. ఈ ఫలితాలతో మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా?' అంటూ ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ పై టాలీవుడ్ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. 'అసలు నీ గోల ఏంటో అర్థం కావడం లేదు. నీ అహంకారంతో ఎంతో మంది నిర్మాతలు, డైరెక్టర్లను ఇబ్బంది పెట్టావు కదా. నువ్వు సంతోషంగా ఉన్నావా? హెడ్ లైన్లలో నిలవాలని ప్రయత్నించకు. ముందు ఒక నాయకుడిగా ఎదుగు. అప్పుడు ఎదుటివారిని కామెంట్ చెయ్. నీ వ్యాఖ్యలను మేము అప్పుడు సీరియస్ గా తీసుకుంటాం' అంటూ ట్వీట్ చేశారు.
Prakash Raj
madhura sridhar reddy
Narendra Modi

More Telugu News