KTR: రామన్నా కంగ్రాట్స్: హీరో విజయ్ దేవరకొండ!

  • కేటీఆర్ కు 'లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు
  • కంగ్రాట్స్ చెప్పిన విజయ్
  • సరదాగా రిప్లై ఇచ్చిన కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతిష్ఠాత్మక 'లీడర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా కేటీఆర్ కు అభినందనలు తెలియజేశాడు.

"రామన్నా, లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైనందుకు కంగ్రాట్స్. మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నా... ఎందుకంటే సుదీర్ఘ కాలం మీరు మాకు అవసరం" అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. "థ్యాంక్స్ అర్జున్ రెడ్డి... ఇప్పుడు మిమ్మల్ని గారు అంటే బాగుండదేమో" అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు.
KTR
vijay devarakonda
tollywood
leader of the year

More Telugu News