BJP: కౌంటింగ్ పై తాజా అధికారిక ప్రకటన వెలువరించిన ఎలక్షన్ కమిషన్!

  • స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ
  • ఈసీ ప్రెస్ రిలీజ్ ప్రకారం 97 చోట్ల బీజేపీ, 64 చోట్ల కాంగ్రెస్
  • నోటాకు 1.9 శాతం ఓట్లు
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతోంది. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన తాజా అధికారిక ప్రకటన ప్రకారం, ఇప్పటివరకూ ఏ ఒక్క స్థానంలోనూ తుది ఫలితం వెల్లడి కాలేదు. ఓట్ల లెక్కింపు అన్ని నియోజకవర్గాల్లో మొదలైంది. 97 చోట్ల బీజేపీ, 64 చోట్ల కాంగ్రెస్, ఒక్క చోట ఎన్సీపీ, 2 చోట్ల బీటీపీ (భారతీయ ట్రైబల్ పార్టీ), 3 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బీజేపీకి 48.5 శాతం, కాంగ్రెస్ కు 42.5 శాతం ఓట్లు వచ్చాయి. 1.9 శాతం ఓటర్లు 'నోటా'ను ఎంచుకోవడం గమనార్హం.
BJP
EC
Congress
Gujarath
Elections

More Telugu News