Tanikella Bharani: 'కేసీఆర్ వచ్చిండిక'.... అంటూ పాట అందుకున్న తనికెళ్ల భరణి!

  • అత్యంత వైభవంగా సాగుతున్న తెలుగు మహాసభలు
  • రెండో రోజు తనలోని పాండిత్యాన్ని చాటిన తనికెళ్ల
  • ఆహూతుల హర్షధ్వానాలు

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమాలు ఆహూతులను అలరించగా, ప్రముఖ నటుడు, సాహితీవేత్త తనికెళ్ల భరణి బంగారు తెలంగాణను గుర్తు చేస్తూ, వేదికపై పాడిన పాట ఆహూతుల హర్షధ్వానాల మధ్య సాగింది.

"బంగారు తెలంగాణ కనపడ్డది బిడ్డా...
బాంచన్ నీ కాలు మొక్తా పాయె బొందల గడ్డా
తెలంగాణ మట్టి నువ్వు ముట్టిజూస్తే నెత్తురు
మన్నుల కన్నీరు కలిపి పూసుకుంటే అత్తరు
ఎంత గతం ఉండె మనకు
ఎంత ఖతం చేస్తిరి
సంస్కృతినీ కాలబెట్టి...
సంస్కృతినీ కాలబెట్టి నోట్లొమన్ను పోసిరి!
గులాబీల దళమొస్తది గుండెలల్ల ఉంటది
ప్రేమకు పరిమళమిస్తుది...
ప్రేమకు పరిమళమిస్తుది ద్రోహుల ములు గుస్తది!
బంగారు తెలంగాణ కలదీరెను బిడ్డా...
కేసీఆర్ వచ్చిండిక అభివృద్ధికి అడ్డా...
కేసీఆర్ వచ్చిండిక అభివృద్ధికి అడ్డా...
కేసీఆర్ వచ్చిండిక అభివృద్ధికి అడ్డా..." అంటూ అంత్య ప్రాస ఆధారంగా భరణి, తన పాండిత్యాన్ని, గానకళను వేదికపై చాటారు.

More Telugu News