jallikattu: త్వ‌ర‌లో జ‌ల్లిక‌ట్టు ప్రీమియ‌ర్ లీగ్‌... జ‌న‌వ‌రి 7 నుంచి ప్రారంభం

  • ఐపీఎల్ త‌ర‌హాలో జ‌ల్లిక‌ట్టు పోటీలు
  • నిర్వ‌హిస్తున్న త‌మిళ‌నాడు జ‌ల్లిక‌ట్టు పెర‌వై
  • ఇంకా ఏం స్పందించ‌ని జంతుప్రేమికులు

గ‌తేడాది జ‌న‌వ‌రిలో త‌మిళ‌నాడులోని సంప్ర‌దాయ క్రీడ జ‌ల్లిక‌ట్టు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. 2014లో సుప్రీంకోర్టు నిషేధానికి గురైన ఈ క్రీడ‌ను న్యాయ‌బ‌ద్ధం చేస్తూ త‌మిళ‌నాడు అసెంబ్లీ చ‌ట్టం చేసింది. అందుకే ఈ ఏడాది ఐపీఎల్ త‌రహాలో జ‌ల్లిక‌ట్టు ప్రీమియ‌ర్ లీగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ లీగ్‌ను త‌మిళ‌నాడు జ‌ల్లికట్టు పెర‌వై, చెన్నై జ‌ల్లిక‌ట్టు అమైప్పు సంఘాలు సంయుక్తంగా నిర్వ‌హించ‌నున్నాయి. ఈ పోటీలు జ‌న‌వ‌రి 7 నుంచి ఈస్ట్‌కోస్ట్ రోడ్‌లో జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఈ ప్రీమియ‌ర్ లీగ్ నిర్వ‌హ‌ణ గురించి జ‌ల్లిక‌ట్టు క్రీడ‌కు మొద‌ట్నుంచి వ్య‌తిరేక‌త తెలియ‌జేస్తున్న జంతుహ‌క్కుల సంఘాలు ఇంకా ఏం స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News