subhalekha sudhakar: 'సాగర సంగమం' చూసి శైలజ గురించి అలా అనుకున్నారు: శుభలేఖ సుధాకర్

  • శైలజ నటించిన 'సాగర సంగమం' చూశాను 
  • అప్పటికి మా పెళ్లి కాలేదు 
  • జంధ్యాల గారి ద్వారా ఈ సంబంధం వచ్చింది 
  • శైలజకి నటన పట్ల ఆసక్తి లేదు      

గాయనిగా శైలజ గారు పేరు ప్రతిష్ఠలను సంపాదించుకున్నారు. 'సాగర సంగమం' సినిమా చూసిన వాళ్లు జయప్రద కూతురు పాత్రలో ఆమె పలికించిన హావభావాలను అంత తేలికగా మరిచిపోలేరు. తాజాగా ఐ డ్రీమ్స్ కి శుభలేఖ సుధాకర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమాను గురించిన ప్రస్తావన వచ్చింది.

 అప్పుడాయన స్పందిస్తూ .. 'సాగర సంగమం' సినిమాకి ముందే నేను చేసిన 'శుభలేఖ' సినిమా వచ్చేసింది. నేను 'సాగర సంగమం' సినిమా చూశాను .. అప్పటికి నాకు శైలజతో వివాహం కాలేదు. జంధ్యాల గారి ద్వారా ఈ సంబంధం వచ్చింది. 'సాగర సంగమం' సినిమా చూసిన చాలామంది .. "శైలజ స్వభావం అలాంటిది .. కాస్త పొగరుగా ఉంటుంది .. వీడు చూస్తేనేమో చాలా సాఫ్ట్ .. ఈ ఇద్దరికీ ఎలా పొంతన కుదురుతుంది?" అని అనుకున్నారు. నిజం చెప్పాలంటే ఆమెకి సినిమాల్లో నటించాలని ఉండేది కాదు" అంటూ చెప్పుకొచ్చారు.    

More Telugu News