రకుల్ 'దాగుడు మూతలు' .. ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట!
- హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'దాగుడుమూతలు'
- దిల్ రాజు నిర్మాణంలో వరుసగా నాల్గొవ సినిమా
- నితిన్ జోడీగా సాయిపల్లవి
హరీశ్ శంకర్ తాజా చిత్రం 'దాగుడు మూతలు'కు కూడా దిల్ రాజు నిర్మాత కావడం విశేషం. నితిన్ .. శర్వానంద్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నారు. శర్వానంద్ సరసన రకుల్ ను సంప్రదించారు. ఆమె ఓకే అన్నట్టుగా ప్రచారం జరిగింది గానీ, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. హరీశ్ శంకర్ కి 'ఎస్' అని గానీ .. 'నో' అని గాని చెప్పకుండా ఆయనతో ఆమె 'దాగుడుమూతలు' ఆడుతోందని కొందరు జోక్ చేస్తున్నారు కూడా.