jai: భయపెడుతూనే ఆసక్తిని రేపుతోన్న 'బెలూన్' ట్రైలర్

  • అంజలి తాజా చిత్రంగా 'బెలూన్' 
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో కథ 
  • ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు

అంజలి .. 'జై' కాంబినేషన్లో గతంలో వచ్చిన 'జర్నీ' సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధించిందో తెలిసిందే. అదే కాంబినేషన్లో ఇప్పుడు 'బెలూన్' సినిమా రావడానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా వుంది. సస్పెన్స్ .. హారర్ నేపథ్యంలో కొనసాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంది.

 ఫ్లాష్ బ్యాక్ సీన్స్ .. ప్రస్తుతం నడుస్తున్న కథకి సంబంధించిన సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. కొంతకాలం క్రితం సైకిల్ కి 'బెలూన్స్' కట్టుకుని అమ్మే ఓ యువకుడు .. ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వలన అతను ఆ అమ్మాయిని హత్య చేస్తాడు. ఆ ఇంట్లో దెయ్యంగా మారిన ఆ అమ్మాయి .. బెలూన్ లా తిరుగుతూ ఉంటుంది. అదే ఇంట్లోకి జై .. అంజలి రావడం .. అక్కడ వాళ్లకి ఎదురయ్యే భయంకర సంఘటనలతో ఈ సినిమా కొనసాగుతుందట. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News