china: 10వ అంతస్తు గది కిటికీ నుంచి జారి కింద ప‌డిన యువ‌తి.. స్వల్ప గాయాలు!

  • ప్రియుడితో గొడ‌వప‌డి హోట‌ల్‌కి వెళ్లిన చైనా యువ‌తి
  • స్నేహితురాళ్ల‌తో మ‌ద్యం పార్టీ
  • తాగి ఊగుతూ కింద ఉన్న కారుపై ప‌డ్డ యువ‌తి
  • అయిన‌ప్ప‌టికీ స్వ‌ల్ప‌గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డ వైనం

బాగా మ‌ద్యం తాగి ప్రమాదవశాత్తు 10వ అంతస్తు గది కిటికీ నుంచి జారి కింద ప‌డిన యువ‌తి అదృష్ట‌వశాత్తూ బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డ ఘ‌ట‌న చైనాలో చోటు చేసుకుంది. ప్రియుడితో బ్రేక‌ప్ అయిన ఓ యువ‌తి గువాంషీ ప్రావిన్స్‌లోని ఓ హోటల్‌లో ఓ రూమ్ తీసుకుని త‌న స్నేహితురాళ్ల‌తో కలసి మ‌ద్యం తాగింది. మ‌త్తులో కిటికీ వ‌ద్ద‌కు ఊగుతూ వ‌చ్చిన ఆమె ఒక్క‌సారిగా ప‌డిపోయి కింద ఉన్న ఉన్న కారుపై ప‌డింది.

దీంతో కారు పైభాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆ కారు ఆమె బరువును ఆపగలగ‌డంతో స్వ‌ల్పంగా మాత్ర‌మే గాయాలయ్యాయి. కానీ, సృహ కోల్పోయింది. ఆమెను ఆసుపత్రికి త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. ఆమెను పోలీసులు ఆసుప‌త్రికి తీసుకెళుతుండ‌గా తీసిన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారాయి.    

More Telugu News