Ajinkya Rahane: రోడ్డు యాక్సిడెంట్ కేసులో క్రికెట‌ర్ అజింక్య రహానే తండ్రి అరెస్టు!

  • ప్రమాదంలో మ‌ర‌ణించిన 67 ఏళ్ల మ‌హిళ‌
  • కొల్హాపూర్‌లో ఘ‌ట‌న‌
  • సెక్ష‌న్ 304ఏ కింద కేసు బుక్ చేసిన పోలీసులు
భార‌త జ‌ట్టు ఆట‌గాడు అజింక్య ర‌హానే తండ్రి మ‌ధుక‌ర్ బాబురావ్ ర‌హానేను కొల్హాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డు యాక్సిడెంట్ కేసులో ఓ మ‌హిళ మ‌ర‌ణానికి కార‌ణ‌మైనందున ఆయ‌న‌పై 304ఏ, 337, 338, 279, 184 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. తన కుటుంబంతో క‌లిసి ఆయన హ్యుందాయ్ ఐ20 కారులో త‌ర్కార్లీ ప్రాంతానికి వెళ్తుండ‌గా పూణె-బెంగ‌ళూరు హైవే మీద కా‌గ‌ల్ బ‌స్‌స్టేష‌న్‌కి స‌మీపంలో ఈ యాక్సిడెంట్ జ‌రిగింది.

ఈ ప్ర‌మాదంలో ఆశాటై కాంబ్లే (67) అనే మ‌హిళ తీవ్ర‌గాయాల పాలై, ఆసుప‌త్రికి తీసుకువెళ్లేలోగానే మ‌ర‌ణించింది. ప్ర‌స్తుతం ర‌హానే శ్రీలంక‌తో మూడో వ‌న్డే ఆడ‌టానికి భార‌త‌జట్టుతో క‌లిసి విశాఖప‌ట్నంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.
Ajinkya Rahane
madhukar baburao
arrest
accident

More Telugu News