కూలిన భారత్-చైనా ఏకైక వారధి.. కొంప ముంచిన అధిక బరువు
- 2013లో రెండు దేశాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం
- ఒకేసారి రెండు ట్రక్కులు వంతెనపైకి రావడంతో ప్రమాదం
- గంగోత్రికి తెగిపోయిన సంబంధాలు
అయితే నిబంధనలకు విరుద్ధంగా గురువారం ఒక్కసారిగా రెండు ట్రక్కులు వంతెన మధ్యకి వచ్చాయి. దీంతో అధిక బరువుకు తట్టుకోలేని బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. బ్రిడ్జి కూలిపోయి సంబంధాలు తెగిపోవడంతో ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని సిద్ధం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వంతెన కూలడంతో గంగోత్రి, మనేరి, హార్సిల్ సహా పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.