charan: 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో చరణ్?

  • చరణ్ తో సందీప్ రెడ్డి వంగా ఫోటో 
  • ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటూ టాక్ 
  • మరో హీరోగా శర్వానంద్ అంటూ ప్రచారం
'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగాకు మంచి పేరు వచ్చింది. దాంతో ఆయన తదుపరి చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చరణ్ తో దిగిన ఫోటో ఊహాగానాలకు తెరతీసింది. చరణ్ వైఫ్ ఉపాసన తయారు చేసిన క్రిస్మస్ ట్రీ దగ్గర చరణ్ .. సందీప్ రెడ్డి .. శర్వానంద్ .. యూవీ క్రియేషన్స్ పార్ట్నర్ విక్కీ కలిసి ఫోటో దిగారు.

 చరణ్ ఈ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్వరలో చరణ్ సినిమా ఉండవచ్చనే ప్రచారం మొదలైంది. ఇక ఈ ఫోటోలో శర్వానంద్ కూడా ఉండటంతో చరణ్ .. శర్వానంద్ లతో సందీప్ రెడ్డి వంగా మల్టీ స్టారర్ చేయనున్నాడని అంటున్నారు. 'రంగస్థలం' నైజామ్ రైట్స్ ను విక్కీ తీసుకోనున్నాడని చెబుతున్నారు. ఏది నిజమో తెలియాలంటే మరి కొన్ని రోజుల పాటు వెయిట్ చేయవలసిందే.     
charan
sharwanand

More Telugu News